Mister Supranational: ‘‘మిస్టర్ సూప్రనేషనల్-2021’’ పోటీల్లో మన దేశం తరఫున అధికారికంగా పాల్గొనాలని అనుకుంటున్నారా?. అయితే ఈ సదవకాశం మీకోసమే. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోయే మిస్టర్ పర్ఫెక్ట్ ని ఎంపిక చేసేందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకొని దరఖాస్తులను సమర్పించాలి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండేట్లకు ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ తో కూడిన జడ్జిల ప్యానెల్ వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మంచి పర్సనాలిటీ, ఫిజిక్, ఎట్రాక్టివ్ లుక్, ఉత్తమ అభిరుచులు, అత్యుత్తమ అలవాట్లు, ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జూన్ తొలి వారంలో ప్రకటిస్తారు. అతణ్ని మిస్టర్ సూప్రనేషనల్-2021 పోటీలకు పంపిస్తారు.
‘మిస్టర్ సూప్రనేషనల్-2021’ కాంపిటీషన్ ని పోలండ్ దేశంలో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తారు. ఇందులో 41 దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటారని అంచనా. ఈ ప్రెస్టేజియస్ కాంటెస్టులో ఇండియా 2015 నుంచి పాల్గొంటోంది. ఇప్పటికి నాలుగు సార్లు ప్లేస్మెంట్స్ సాధించింది. 2018లో మనోడు ప్రథమేస్ మౌలింగ్ కర్ విన్నర్ గా నిలిచాడు. తద్వారా ఆసియా నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు. 2019లో ఈ టైటిల్ ని యనైటెడ్ స్టేట్స్ కి చెందిన నాటే క్రన్కోవిచ్ సాధించాడు. ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.
‘‘మిస్టర్ సూప్రనేషనల్-2021’’ పోటీల్లో మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీ లభించాలంటే ముందుగా ఇక్కడ గెలవాలి. దీనికి 18-32 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. 2021 డిసెంబర్ 31 నాటికి ఎంత వయసు ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉండాలి. వివాహం చేసుకొని ఉండకూడదు. సింగిల్ అయుండాలి. ఎంగేజ్మెంట్ కూడా కాకూడదు. ఇండియాలో పుట్టిన వ్యక్తే పాల్గొనాలి. పాస్ పోర్ట్ ఉండాలి. ఓసీఐ కార్డ్ హోల్డర్ ని లేదా ఎన్ఆర్ఐని అనుమతించరు. కాబట్టి పైన చెప్పిన అర్హతలున్న జెంటిల్మెంట్ కి ఈ ప్రపంచ వేదికపై ఇండియాని విజేతగా నిలిపేందుకు, గర్వంగా నిలబెట్టేందుకు ఇదో పెద్ద ఆపర్చునిటీ. విశ్వవ్యాప్తంగా ఉన్న యువతకు ఆదర్శంగా నిలిచేందుకు కూడా ఛాన్స్. మరెందుకు ఆలస్యం అప్లై చేసేయండి.