Sachin: మానసిక ఒత్తిణ్ని.. మటాష్ చేశాను..

Sachin: సచిన్ టెండుల్కర్ ని సెంచరీల టెండుల్కర్ అని కూడా అంటారు. ఈ మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్ అనే మతానికి దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నాడు. అయినప్పటికీ తన కెరీర్ లో మొదటి మ్యాచ్ మొదలుకొని రిటైర్ అయ్యే ముందు ఆడిన చివరి మ్యాచ్ వరకు మైదానంలోకి అడుగు పెట్టే ప్రతిసారీ మానసిక ఒత్తిడికి గురయ్యేవాడట. దాన్ని ఎలా జయించాడో లేటెస్టుగా వెల్లడించాడు. అన్ అకాడెమీ అనే సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ […].

By: jyothi

Updated On - Mon - 17 May 21

Sachin: మానసిక ఒత్తిణ్ని.. మటాష్ చేశాను..

Sachin: సచిన్ టెండుల్కర్ ని సెంచరీల టెండుల్కర్ అని కూడా అంటారు. ఈ మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్ అనే మతానికి దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నాడు. అయినప్పటికీ తన కెరీర్ లో మొదటి మ్యాచ్ మొదలుకొని రిటైర్ అయ్యే ముందు ఆడిన చివరి మ్యాచ్ వరకు మైదానంలోకి అడుగు పెట్టే ప్రతిసారీ మానసిక ఒత్తిడికి గురయ్యేవాడట. దాన్ని ఎలా జయించాడో లేటెస్టుగా వెల్లడించాడు. అన్ అకాడెమీ అనే సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను వివరించాడు. ఈ లిటిల్ ఛాంపియన్ దాదాపు 10-12 ఏళ్ల పాటు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు. అయితే.. క్రమంగా తనలో మార్పు తెచ్చుకున్నాడు.

Sachin Tendulkar

ఎలాగంటే..

పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలను మార్చుకోవటం, ఆటకు ముందే మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ నెస్ సాధించటం అలవాటు చేసుకున్నాడు. మానసిక ప్రశాంతత కోసం నచ్చిన పనులు చేసేవాడు. టీ పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయటం, బ్యాగు సర్దుకోవటం వంటి వ్యాపకాలతో మనసు తేలికపరచుకునేవాడు. ఏ విషయాన్నైనా తన మనసు అంగీకరించేలా అడ్వాన్స్ డ్ గా రెడీ అయ్యేవాడు. ‘‘ఆటలో భాగంగా గాయాల బారిన పడ్డప్పుడు ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు మా వెంటే ఉండి అన్ని రకాల పరీక్షల్ని నిర్వహిస్తారు. మెడిసిన్స్ ఇస్తారు. కానీ మెంటల్ హెల్త్ విషయంలో మాత్రం మేమే చొరవ తీసుకొని వైద్యుణ్ని సంప్రదించేవాళ్లం’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.

Sachin Tendulkar

అప్ అండ్ డౌన్స్..

ప్రతిఒక్కరి జీవితంలోనూ ఎత్తు-పల్లాలు సహజమని, అలాంటి సమయంలో ఆత్మీయుల అండ దొరికితే మనసు కొంచెం కుదుటపడుతుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. తద్వారా హ్యూమన్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో చెప్పాడు. ప్రధానంగా ఎలాంటి పరిణామాలనైనా స్వీకరించే గుణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించాడు. అప్పుడే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నాడు. ఈ అంశాలన్నీ అనుభవపూర్వకమని తెలిపాడు. సచిన్ టెండుల్కర్ తన అసమాన, అద్భుతమైన ఆట, సత్ప్రవర్తనతోనే కాకుండా ఇలాంటి చక్కని సలహాలతో కూడా అభిమానుల్లో, ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సచిన్ చెప్పిన ఈ మాటలు అందరికీ ఆచరణీయమని అంటున్నారు.

Sachin Tendulkar

Latest News

Related News