Smart Phone : బ్యాటరీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇలా చేస్తే..

Smart Phone : ఆఫీసుల్లో.. ఇళ్లల్లో.. ప్రయాణాల్లో.. ఫంక్షన్లలో.. చాలా మంది తమ ఫోన్లకు ఛార్జింగ్ లేదని, అందుకే స్విచ్ఛాఫ్ అయిందని చెబుతుండటం వింటుంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం, ఇబ్బంది తప్పదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఫోన్ లోని బ్యాటరీ ప్రాబ్లం కావొచ్చు. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం కావొచ్చు. ఏదేమైనా పెద్ద ఫోన్లల్లోని బ్యాటరీల లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే కొంత కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. […].

By: jyothi

Published Date - Mon - 5 April 21

Smart Phone : బ్యాటరీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇలా చేస్తే..

Smart Phone : ఆఫీసుల్లో.. ఇళ్లల్లో.. ప్రయాణాల్లో.. ఫంక్షన్లలో.. చాలా మంది తమ ఫోన్లకు ఛార్జింగ్ లేదని, అందుకే స్విచ్ఛాఫ్ అయిందని చెబుతుండటం వింటుంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం, ఇబ్బంది తప్పదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఫోన్ లోని బ్యాటరీ ప్రాబ్లం కావొచ్చు. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం కావొచ్చు. ఏదేమైనా పెద్ద ఫోన్లల్లోని బ్యాటరీల లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే కొంత కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. అదేంటో చూద్దాం.

ముందే మేల్కోవాలి..

ఫోన్ ఛార్జింగ్ తొందరగా దిగిపోతోందంటే బ్యాటర్ పాడైపోతున్నట్లు భావించాలి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఛార్జింగ్ ఎప్పుడూ 20 శాతం కన్నా తక్కువకి రాకుండా చూసుకోవాలి. సున్నాకి చేరుకుంటున్నా పట్టించుకోకుండా వాడటం కరెక్ట్ కాదు. వీలైతే వెంటనే ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయాలి. అలాగే.. రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని పడుకోకూడదు. ఎందుకంటే నైట్ మొత్తం కరెంట్ స్విఛ్ ఆన్ చేసి ఉంచితే ఫోన్ ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. అది బ్యాటరీ క్వాలిటీని దెబ్బతీస్తుంది. ఫోన్లు చాలా వరకు గంటన్నర లోపే (90 నిమిషాల్లోపే) ఫుల్ ఛార్జింగ్ అవుతాయి. కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

సెంచరీ వద్దు: Smart Phone

ఫోన్ ఛార్జింగ్ ప్రతిసారీ వంద పాయింట్లకు చేరుకునేదాక ఉంచాల్సిన పనిలేదు. 90 శాతం దాటిన తర్వాత తీసేయటం బెటర్. దీనివల్ల ఓవర్ ఛార్జింగ్ కి చెక్ పెట్టొచ్చు. తద్వారా బ్యాటర్ లైఫ్ ని పెంచుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్లను ఎక్కువ సార్లు వాడొద్దు. ఎప్పుడో ఒకటీ రెండు సార్లు అయితే ఓకే. 5 వాట్ల సామర్థ్యం గల స్టాండర్డ్ అడాప్టర్ వల్ల ఛార్జింగ్ స్లోగా ఎక్కుతుందనే గానీ లాంగ్ రన్ లో దీని వల్ల మంచి ఫలితాలే వస్తాయి.

పవర్ సేవింగ్..

చాలా మంది సహజంగా ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తారు. కానీ మిగతా సమయాల్లోనూ ఇలా చేయొచ్చు. గేమ్స్ ఆడనప్పుడు, సీరియస్ మల్టీ టాస్కింగ్ చేయనప్పుడు సైతం ఈ ఆప్షన్ ని వాడుకోవచ్చు. ప్రతిసారీ ఫుల్ పవర్ మోడ్ లోనే ఫోన్ ఆపరేట్ చేయాలనుకోవటం పొరపాటు. అవసరం లేనప్పుడు వై-ఫై, బ్లూటూత్ వంటివాటినీ బంద్ పెట్టాలి. ఇవి ఛార్జింగ్ ని తినేస్తాయి. ఎక్కువ కాలం వీటిని ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ హెల్త్ క్షీణిస్తుంది.

వైర్ లెస్.. : Smart Phone

ఈమధ్య కాలంలో వైర్ లెస్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటోంది. ఇయర్ బడ్స్ వంటి వాటికి ఛార్జింగ్ పెట్టడానికి ఈ ఫీచర్ ని అత్యవసరమైతే తప్ప వినియోగించొద్దు. ఎందుకంటే ఇది బ్యాటరీపైన క్రమంగా బ్యాడ్ ఇంప్యాక్ట్ చూపుతుంది. నాసి రకం ఛార్జర్లు, కేబుళ్లు వాడకూడదు. అవి బ్యాటరీని హీటెక్కించి వాటి జీవిత కాలాన్ని హరిస్తాయి. మంచి రేటింగ్ కలిగిన, బ్రాండెడ్ పవర్ బ్యాంక్ లనే ప్రిఫర్ చేయాలి. చీప్ క్వాలిటీ పరికరాల జోలికి పోవొద్దు. నిత్యం వాడని యాప్స్ ఏమైనా ఫోన్ లో ఉంటే వాటిని డిలీట్ చేయటం మంచిది. బ్యాక్ గ్రౌండ్ యాప్ లను టర్న్ ఆఫ్ చేయాలి.

Latest News

Related News