Special Articleతెలుగు సినీ పరిశ్రమలో అన్నదమ్ముల అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమ పిల్లల్ని సినీ రంగంలోకి పరిచయం చేసే నిర్మాతలు, నటీనటులు, దర్శకులు చాలామందే వున్నారు. సోదరుల్ని హీరోలుగా ప్రమోట్ చేస్తోన్న హీరోలూ తక్కువేమీ కాదు. అయితే, ఎంత ప్రమోట్ చేసినా, టాలెంట్ వుంటేనే కెరీర్ పరంగా నిలదొక్కకునేది. అన్నను మించిన తమ్ముడు.. అనిపించుకున్నారు కొందరు. అన్న అడుగు జాడల్లోనే నడిచారు ఇంకొందరు. అన్న పేరు చెడగొట్టిన తమ్ముళ్ళూ లేకపోలేదు. అది వేరే కథ. ఇక్కడ మనం సక్సెస్ అయిన అన్నదమ్ముల గురించి మాట్లాడుకుందాం.
చిరంజీవి – పవన్ కళ్యాణ్
చిరంజీవి సోదరుడుగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకు8న్నాడు. ప్రత్యేకత ఏంటంటే, నటుడిగా ఎదగడానికి అన్నయ్య స్టార్ డమ్ ఎక్కడా ఉపయోగించుకోలేదు పవన్ కళ్యాణ్. అన్నదమ్ములిద్దరూ ’శంకర్ దాదా జిందాబాద్‘ చిత్రంలో కలిసి నటించారు.
SPECIAL ARTCILE ON TOLLYWOOD BRITHERS :CHIRANJEEVI with PAWAN KALYAN
అల్లు అర్జున్ – అల్లు శిరీష్
అల్లు అర్జున్ హీరోగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అన్నకు తమ్ముడిగా అల్లు శిరీష్ కూడా హీరోగా తన టాలెంట్ చూపించాలనుకున్నాడు. ’గౌరవం‘ సినిమాతో తెరంగేట్రం చేశాడు. కమర్షియల్ హీరోగా అన్నయ్య రేంజ్ స్టార్ డమ్ సంపాదించకపోయినా, ఓ మోస్తరు హీరోగా ఇండస్ర్టీలో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు అల్లు శిరీష్.
special article on tollywood brothers – Allu Arjun-Allusirish
సాయిధరమ్ తేజ్ – వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుండి పరిచయమైన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. మెగా మేనల్లుడిగా తనదైన శైలి హీరోయిజం చూపించి, సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. ఇక తేజు సోదరుడు వైష్ణవ్ తేజ్ రీసెంట్ గా ’ఉప్పెన‘ సినిమాతో నిజంగా ఉప్పెనలాగే దూసుకొచ్చాడు. డెబ్యూ మూవీకే ఏ హీరో చేయని రిస్కీ అటెంప్ట్ చేసి, సక్సస్ తో పాటు, విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు.
special article on tollywood heroes brothers – Panja Vaishnavtej-SaiDharam tej
కళ్యాణ్ రామ్ – జూ.ఎన్టీయార్
హరిక్రిష్ణ తనయులు వీరిద్దరూ. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కాగా, మరో భార్య కొడుకు ఎన్టీఆర్. ఇద్దరూ హీరోలుగా సక్సెస్ ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ’జై లవకుశ‘ మూవీ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
special article on tollywood heroes kalyan ram with jr. NTR
బాలయ్య – హరిక్రిష్ణ
స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసులైన హరిక్రిష్ణ, బాలక్రిష్ణలు హీరోలుగా ఇండస్ర్టీలో సక్సెస్ అయినవారే. హరిక్రిష్ణ హీరోగా తక్కువ సినిమాలే చేసినప్పటికీ, బాలక్రిష్ణ మాత్రం అగ్ర హీరోల్లో ఒకరు. ఈ ఇద్దరూ హీరోలుగా, హీరోయిన్ సిమ్రాన్ తో జత కట్టడం విశేషం.
special article on tollywood brothers balakrishna – harikrishna
మంచు విష్ణు – మంచు మనోజ్
సీనియర్ నటుడు కమ్ నిర్మాత మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్. హీరోలుగా తమ తమ స్థాయి సక్సెస్ లు అందుకున్నారు. మంచు విష్ణు హీరోగా కొన్ని కమర్షియల్ హిట్స్ సొంతం చేసుకోగా, వెర్సటైల్ హీరోగా మంచు మనోజ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
special article on tollywood brothers manchuvishnu-manoj
విజయ్ దేవరకొండ – ఆనంద్ దేవరకొండ
లేటెస్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ’అర్జున్ రెడ్డి‘ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, రాత్రికి రాత్రే సెన్సేషనల్ హీరో అనిపించుకున్నాడు. రౌడీ స్టార్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండనీ దించాడు. ’దొరసాని‘ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు ఆనంద్ దేవరకొండ. తొలి సినిమా నిరాశ పరిచినప్పటికీ, ’మిడిల్ క్లాస్ మెలోడీస్‘ అంటూ రెండో సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. అయితే, ఈ సినిమా కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజై, ఆడియన్స్ కి వినూత్నమైన అనుభూతినీ, ఆహ్లాదాన్ని అందించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
special article on tollywood brothers – vijay deverakonda with his brother
వస్తారు, ఇంకా వస్తారు.. వస్తూనే వుంటారు. అదేమీ తప్పు కాదు. ముందే చెప్పుకున్నాం కదా.. టాలెంట్ వుంటేనే, ఇక్కడ నిలదొక్కుకునేది. టాలెంట్ వుంది గనుకనే పైన చెప్పుకున్నవారంతా తమదైన ముద్ర వేశారు సినీ రంగంలో.