Salim Anarkali: సలీం అనార్కలి లవ్ స్టోరీలో చేదు నిజం ఇదే..

Salim Anarkali: చరిత్ర వినేందుకు ఎంత తీయగా ఉంటుందో, ఒక్క సారి చరిత్రలోకి తొంగి చూస్తే, కొన్ని చేదు నిజాలు కూడా వినాల్సి వస్తుంది.  ఒక్క కోణంలోంచి చూస్తేనే చరిత్ర అందంగా కనిపిస్తుంది. నాణానికి రెండు కోణాలు.. అన్నట్లుగా మరో కోణం కూడా ఉంటుంది. అలా వెతికి తీసిన చరిత్ర మరో కోణంలో మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సలీం – అనార్కలిల ప్రేమ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సలీం అనార్కలి.. ఆ జనరేషన్, ఈ జనరేషన్ […].

By: jyothi

Published Date - Tue - 7 September 21

Salim Anarkali: సలీం అనార్కలి లవ్ స్టోరీలో చేదు నిజం ఇదే..

Salim Anarkali: చరిత్ర వినేందుకు ఎంత తీయగా ఉంటుందో, ఒక్క సారి చరిత్రలోకి తొంగి చూస్తే, కొన్ని చేదు నిజాలు కూడా వినాల్సి వస్తుంది.  ఒక్క కోణంలోంచి చూస్తేనే చరిత్ర అందంగా కనిపిస్తుంది. నాణానికి రెండు కోణాలు.. అన్నట్లుగా మరో కోణం కూడా ఉంటుంది. అలా వెతికి తీసిన చరిత్ర మరో కోణంలో మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సలీం – అనార్కలిల ప్రేమ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సలీం అనార్కలి.. ఆ జనరేషన్, ఈ జనరేషన్ అనే తేడా లేకుండా, ఈ జంట గురించి అందరికీ తెలిసిందే. కానీ ఎంత వరకూ.? వీరిద్దరిదీ ఓ వీర ప్రేమ గాధట.  ట్రాజెడీ లవ్ స్టోరీ అని కూడా తెలుసు. ట్రాజెడీ అంటే, సలీం కోసం అనార్కలి ప్రాణాలొదిలింది. కాదు, కాదు, అనార్కలి కోసమే సలీం ప్రాణాలొదిలేశాడట.. అంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటారు.  భావం ఏదైనా కానీ, వీరిద్దరిదీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే అని చరిత్ర కూడా ప్రూవ్ చేసిందనుకోండి. అసలు సలీం అనార్కలి లవ్ స్టోరీ ఎలా మొదలైంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

 

సలీం ఓ గొప్ప రాజ కుటుంబానికి చెందిన వాడు.  మొగల్ చక్రవర్తి అక్బర్ తనయడు సలీం. ఆ కాలంలో రాజులతో పాటే బానిసలూ ఉండేవారు. వారు కూడా అదే రాజ భవనంలో రాజులు భోగ భాగ్యాలు అనుభవిస్తుంటే, అష్ట కష్టాలు పడుతూ, బానిసలు దుర్భరమైన జీవితం గడిపేవారు. అలా సలీం రాజ భవనంలోని ఓ బానిస అనార్కలి. బానిసే అయినా, చాలా అందగత్తె. అనుకోకుండా, అనార్కలిని చూసిన సలీం ప్రేమలో పడతాడు. ఆమె ఓ బానిస కాబట్టి, రాజయిన సలీంను ఆమె ప్రేమించదని భావించి, అతను కూడా బానిసలాగే,  అనార్కలితో పరిచయం పెంచుకుంటాడు. మెల్లమెల్లగా సలీం  ప్రేమకు బానిస అయిపోతుంది అనార్కలి కూడా.  సలీం మేనమామకు ఈ విషయం తెలుస్తుంది. అనార్కలితో ప్రేమాయణాన్ని ఆపేయాలని సలీంను హెచ్చరిస్తాడు. అందుకు సలీం ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు అనార్కలిని బంధిస్తాడు. ఆమెను విడిపించి తెచ్చుకుంటాడు సలీం. దాంతో వారి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. అలాగే ఓ సారి యుద్ధంలో తీవ్ర గాయాల పాలైన సలీంకు రాత్రి పగలూ సేవలు చేసి, ఆయనను మామూలు మనిషిని చేస్తుంది అనార్కలి. ఇలా వారి ప్రేమాయణం ముదిరి పాకాన పడుతుంది. అక్బర్ వద్దకూ ఈ ప్రేమ కథ చేరుతుంది. దాంతో కొడుకును మందిలించే ప్రయత్నం చేస్తాడు. కానీ, సలీం అందుకు ఒప్పుకోలేదు సరికదా.. తండ్రితో గొడవకు దిగుతాడు. దాంతో, సలీం, అనార్కలి ఇద్దరికీ అక్బర్ మరణ శిక్ష విధిస్తాడు. కానీ, కొడుకుకు ఆ శిక్షను అమలు చేయడంలో పక్షపాతం వహించి, అనార్కలిని మాత్రం సలీంకు తెలియకుండా  మరణ శిక్షను అమలు చేస్తాడు. అలా సలీం అనార్కలి ప్రేమ గాధకు ఫుల్ స్టాప్ పడిపోతుంది. అయితే, అనార్కలి చనిపోయాక సలీం ఏం చేశాడు.?

 

సలీం గురిచి అనేక పుకార్లు చరిత్రలో వినిపిస్తాయి. సలీం అసలు పేరు జహంగీర్. ఆయన పరమ స్ర్తీ లోలుడని అంటుంటారు. ఆయన జీవితంలో అనార్కలితో ప్రేమ అనేది అసలు లేనే లేదనీ, అదంతా ఓ కట్టుకథనీ అంటుంటారు. ఏ స్ర్తీని చూస్తే, ఆ స్ర్తీని మోహించేవాడట సలీం.  అలా చాలా మంది స్ర్తీలతో సలీంకు వివాహం జరిగిందట. వారితో పడక సుఖం తీరిపోయాక, వారిని కట్టు బానిసలను చేసేవాడట. పేరుకే రాణులు కానీ, బానిస బతుకే అనుభవించేవారట వారంతా. అంతేకాదు, సలీం మద్యానికి కూడా బానిసట. ఇంకా రకరకాల దురలవాట్లు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ దురలవాట్ల కారణంగానే ఆయన చనిపోయాడట. కానీ, సలీం అనగానే అనార్కలితో భగ్న ప్రేమికుడు అనే మంచి పేరు మాత్రమే మనకు వినిపిస్తుంది. అందుకూ కారణం లేకపోలేదు. రాజులు మేధావులైన చరిత్ర కారుల్ని తమ రాజ దర్భారులో ఉంచుకుని, తమకు నచ్చిన విధంగా వారి గురించి మంచి మంచి విషయాలు రాయించుకునేవారట. అలా చరిత్రలో కొన్ని తీపి నిజాలు. మరికొన్ని చేదు నిజాలు.. నాణానికి రెండు కోణాలుగా నిలిచాయన్న మాట.

Latest News

Related News