2019లో “ఎలా మరి ఇక రావా” పాటను ఎలా రిలీజ్ చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకునే టైంలో ఆదిత్య మ్యూజిక్ వారు మా సాంగ్ విజువల్స్, కంపోజిషన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలై మమల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమున్నా సరే మా దగ్గర తీసుకురండి మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. దాంతో “ఎలా మరి ఇక రావా” మ్యూజిక్ రిలీజ్ చేశాం. యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ కు వెళ్ళింది.
రీసెంట్ గా మా ఇద్దరి కాంబినేషన్ లో తల్లాడ సాయి దర్శకత్వంలో దేశభక్తికి సంబంధించిన షార్ట్ ఫిలిం ప్రీమియర్ జరిగింది దాంట్లో మేము నువ్వే ఒక సైన్యం అనే టైటిల్ సాంగ్ ను కంపోజ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి థియేటర్లో జనం ఎంతో ప్రశంసలు కురిపించారు.
ఇండస్ట్రీలో మా ఇద్దరిలో ఎవరో ఒకరు సెటిల్ అవుతారు అనుకున్నాము కానీ, మా ఇద్దరికీ కూడా ఆ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవే కాకుండా ఇంకా త్రీ సాంగ్స్ కి కంపోజిషన్ లిరిక్స్ రాయడం జరుగుతుంది. వీటితోపాటు 7 సాంగ్స్ చేయడానికి ఆదిత్య మ్యూజిక్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది.