నెపోలియన్ చిత్రంతో హీరోగా ఆకట్టుకున్న ఆనంద్ రవి లేటెస్ట్ మూవీ ‘కొరమీను’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ (story of egos) అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 31న (Korameenu Release date) మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..సాధారణంగా సినిమాలు థ్రిల్లర్, హారర్, కామెడీ ఇలా పలు జోనర్స్‌లో సినిమాలను రూపొందిస్తుంటారు
జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు.. అతని మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో (Vizag) శక్తివంతమైన పోలీసు ... ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న (Korameenu Release date) మూవీ రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సింగర్ సునీత (Singer Sunitha), బింబిసార (Bimbisara) దర్శకుడు వశిష్ట (Vassishta) ముఖ్య అతిథులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ రవి (Anand Ravi) మాట్లాడుతూ ‘‘కొరమీను (Korameenu) సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి.
మా టీమ్‌కు చక్కగా చూసుకున్న నిర్మాతగారికి థాంక్స్. థ్రిల్లర్ మూవీయే కాదు.. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజికల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 31న (Korameenu release date) సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేం కూడా అంతే హ్యాపీగా న్యూ ఇయర్‌ను (New Year) సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.