e
ఎవరెలా చేశారంటే.. సత్యదేవ్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. మొదటి నుంచి మంచి పాత్రల్లోనే నటిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి తనదైన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని మెప్పించాడు. ఇందులో ఆయన నటనకు వందకు వంద మార్కులు పడుతాయని చెప్పడంలో సందేహం లేదు. మేఘా ఆకాష్ కూడా తన పాత్ర మేరకు పర్వాలేదనిపించింది. ఇక తమన్నా కూడా డీ-గ్లామర్ లుక్‌లో బాగానే ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించాడు. ఆయన క్లాసికల్ గా మ్యూజిక్ ను అందించాడు. ఈ మూవీలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. నిర్మాణపు విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఇందులో బాగా మెప్పించినవి మాత్రం డైలాగ్స్. చాలా డైలాగులు మనసుకు హత్తుకునేలా వున్నాయని చెప్పుకోవాలి. అయితే ఎడిటింగ్ పరంగా లోపం ఉంది. చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటికి కత్తెర వేస్తే బాగుండేది.
చివరగా.. కన్నడ సినిమా అయిన ‘మాక్‌టెయిల్’కి ఇది తెలుగు లో రీమేక్. అందరికీ తెలిసిన కథను తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన తెలుగు నేటివిటీకి నచ్చే విధంగా సినిమాను తీస్తే బాగుండేది. చాలా సీన్లు కాపీ కొట్టినట్టే ఉన్నా కూడా.. మన తెలుగు వారికి నచ్చే విధంగా సినిమాను మార్చలేకపోయాడు దర్శకుడు. సత్యదేవ్-తమన్నా మధ్య లవ్ ట్రాక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కొన్ని సీన్లు మాత్రమే పర్వాలేదనిపిస్తాయి. చాలా వరకు బోర్ కొట్టించే సీన్లే ఉన్నాయి.