విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ (Rahul Yadav) ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి థ్రిల్లర్ తరువాత నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’ (Masooda). తిరువీర్ హీరోగా,  హీరోయిన్ గా సంగీత,  కావ్య కళ్యాణ్ రామ్ నటించారు.

బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ హారర్ డ్రామాను నిర్మించారు. డెబ్యూ దర్శకుడు సాయికిరణ్ డైరెక్షన్ చేశారు. 

ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.