‘ముఖచిత్రం’ మూవీ రివ్యూ.. హిట్టా, ఫట్టా..?

కథ ఎలా ఉందంటే.. ఈ కథ మొత్తం ప్లాస్టిక్‌ సర్జరీ చుట్టూ తిరుగుతుంది. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజ్‌కుమార్ (వికాస్ వశిష్ట)కు మహతి (ప్రియ వడ్లమాని) అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకుని పెండ్లి చేసుకుంటారు. అయితే అనుకోకుండా ఆయన భార్య చనిపోతుంది. దాంతో ఆ బాధను తట్టుకోలేకపోతాడు రాజ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన ఫ్రెండ్‌ అయిన మాయ (అయేషా ఖాన్) ముఖానికి అచ్చం తన భార్యలా ఉండేలా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్‌ అవుతుంది. అసలు ఈ మాయ ఎవరు.? మాయకు రాజ్‌కుమార్‌ ఎందుకు ప్లాస్టిక్‌ సర్జీరీ చేశాడు అనేవి థియేటర్‌ లో చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా ద్వారా పరిచయం హీరోగా అయ్యాడు వికాస్ వశిష్ట. కొత్తవాడే అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా నటించి మెప్పించాడు. ఆయన డైలాగ్ చెప్పే విధానం కావచ్చు.. కొన్ని సీన్లలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్‌ అనే విధంగానే ఉన్నాడు. ఇక మాయ పాత్రలో అయేషా ఖాన్‌ కూడా బాగానే నటించింది. ఇక హీరో విశ్వక్ సేన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన మరోసారి తనదైన నటనతో ఉన్నంత సేపు అలరించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

టెక్నికల్‌ గా ఎలా ఉందంటే.. టెక్నికల్‌ విషయానికి వస్తే.. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. పాటలు ఓకే అనేలాగే ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌ గురించి. ఇందులో బాగా అనిపించేవి అంటే డైలాగ్స్‌ మాత్రమే. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్‌ అయి ఉంటే బాగుండేది.

విశ్లేషణ ప్లాస్టిక్‌ సర్జరీల కాన్సెప్టుతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అందులో చూసుకంటే ఎవడు సినిమా టక్కున గుర్తుకు వస్తుంది. కానీ ఇలాంటి డిఫరెంట్‌ కాన్సెప్టును ఎంచుకున్నప్పుడు కథలో లీనమయ్యేలా చేయాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడు. కొన్ని సీన్లు మాత్రమే ఆకట్టుకున్నాయి. చాలా వరకు బోర్ కొట్టించేస్తాయి. లీడ్ పెయిర్ యాక్టింగ్‌ లో ఇరగదీసినా.. దర్శకుడు తన ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించలేకపోయాడు.

‘ముఖచిత్రం’ మూవీ రేటింగ్: 1.5/5