పంచతంత్రం మూవీ రివ్యూ..!

కథ ఎలా ఉందంటే.. వేదవ్యాస్ (బ్రహ్మానందం) స్టాండప్ కమెడియన్. ఆయన రచయిత కావాలని అనుకుంటారు. మంచి కథలతో ఈ తరాన్ని ఎంటర్‌ టైన్ చేయాలని భావిస్తుంటారు. కానీ ఆయన లక్ష్యానికి కూతురు (కలర్స్ స్వాతి) అడ్డు పడుతుంది. ఆయన వయసును గుర్తు చేస్తూ రెస్ట్‌ తీసుకోమని చెబుతుంది. కానీ ఆయన మాత్రం అస్సలు వినడు. ఈ క్రమంలో ఆయన కథల పోటీలకు వెళ్తారు. అక్కడ ఆయన ఓ ఐదు కథలను చెబుతారు. మరి ఆ ఐదు కథలేంటి అన్నదే ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొన్ని కథల సమూహారం.

ఎవరెలా చేశారంటే.. బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. ఇందులో కూడా ఆయన స్టాండప్ కమెడియన్‌గా బాగానే నటించి మెప్పించాడు. ఆయన కథలు చెప్పే సన్నివేశాల్లో ఇరగదీశాడు. కలర్స్ స్వాతి కూడా తన పాత్రల్లో బాగానే ఆకట్టుకుంది. ఇక కథల్లో వచ్చే పాత్రలు రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, అగస్త్య, సముద్రఖని, దివ్య శ్రీపాద లాంటి వారు ఎవరికి వారే మేటి అనిపించుకున్నారు. వీరంతా మంచి పర్ఫార్మెన్స్‌ కనబరిచారు.

టెక్నికల్‌ గా ఎలా ఉందంటే.. ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం ప్లస్‌ పాయింట్‌ అని చెప్పుకోవాలి. సీన్లకు తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా బాగానే అందించాడు. ఈ మ్యూజిక్‌ కొన్ని సన్నివేశాల్లో లీనమయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే అన్నట్టే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. కొన్ని డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయి.

చివరగా.. ఇలాంటి కొత్త కాన్సెప్టుతో వచ్చిన దర్శకుడి ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇందులో నటీనటుల దగ్గరి నుంచి మంచి పర్ఫార్మెన్స్‌ ను లాక్కున్నారు. కానీ కథను అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా రాసుకోలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో స్లో పేస్ కనిపిస్తోంది. అది సినిమాను కొన్ని సార్లు డల్ మోడ్‌లోకి తీసుకెళుతుంది. ఫీల్ గుడ్ భావన కల్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. కాకపోతే అక్కడక్కడా స్పీడు తగ్గకుండా ఉంటే బాగుండేది.

పంచతంత్రం మూవీ రేటింగ్: 1.5/5