రోజు వారి ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి చలి తీవ్రత అంతగా ఉండదు.

 వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది.

పోషకాహార నిపుణుల ప్రకారం, అధ్యయనాల ప్రకారం, వెల్లుల్లిని పులియబెట్టడం వల్ల దాని పోషకాలు పెరుగుతాయి మరియు వాటిని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుందని తేలింది

వెల్లుల్లిని పొడిగా కూడా తయారుచేసుకుని నిల్వ వుంచుకుంటారు. ఒక చెంచాలో 1/8వ వంతు వెల్లుల్లి గుండ ఒక వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి.

వెల్లుల్లి లోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది.

వెల్లుల్లిలోని విటమిన్‌సి, విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌)లు రోగనిరోధక శక్తి పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీని ద్వారా సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.

పడిగడుపున (ఖాళీ కడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.