స్వామి వారి గర్భాలయాన్ని ఆనుకుని వున్న కులశేఖర పడికీ, రాముల వారి మేడకు, జయ విజయ ద్వార పాలకులకు మూడు పరదాలూ, స్వామి వారికి మరో రెండు కురాలాలూ సమర్పిస్తారట.

 తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘పరదాల మణి’ అంటే తెలియని వాళ్లుండరు. ఇంతకీ ఈ పరదాల మణి ఏం చేస్తారు.? పరదాలు కుడుతూ వుంటారు.

శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే తిరుమంజనం ఆళ్వార్ నాడు టైలర్ మణి, శ్రీవారికి పరదాలూ, కురాలాలూ కుట్టి సమర్పిస్తుంటారు.

తిరుమలలోని తీర్ధ కట్ట వీధిలో సాధారణ టైలర్‌గా జీవనం సాగించే టైలర్ మణికి పరదాల తయారీలో అద్భుతమైన కళ నైపుణ్యం వుంది

1999లో పద్మావతీ ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని కుట్టి ఇచ్చారు.

ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం తర్వాత శ్రీవారికి పట్టు పరదాలు, కురాలాలూ సమర్పిస్తుండడం గత 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.

 శ్రీ వారి గర్భాలయంలో వేలాడే పరదాలు, కురాలాలూ కుట్టేందుకు ఆదేశాలు రావడంతో, గత 24 ఏళ్లుగా ఇక స్వామి వారి సేవలోనే తరిస్తున్నాననీ ఇటీవల మణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

టైలర్‌గా జీవనం సాగించే టైలర్ మణికి పరదాల తయారీలో అద్భుతమైన కళ నైపుణ్యం వుంది.